: కారు ప్రమాదంలో యాంకర్ అనసూయ తలకు స్వల్ప గాయాలు
సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే మరోవైపు టీవీ యాంకర్ గానూ రాణిస్తోన్న అనసూయకు ఈ రోజు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు అనంతపురం జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళుతుండగా మరో కారు ఢీకొట్టడంతో ఆమె తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆ కారును అక్కడే వదిలి ఆమె మరో కారులో రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.