: నాలుగో పెళ్లికి రెడీ అయిన నిత్య పెళ్లికొడుకు... పోలీసులకు పట్టించిన భార్యలు!
ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి నాలుగో పెళ్లికి కూడా రెడీ అయిపోయి ఆ వివాహానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే, అతడి ముగ్గురు భార్యలూ పోలీసులకి తమ భర్త నిర్వాకాన్ని వివరించడంతో అతడి నాలుగో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దనిశ్ అనే వ్యక్తి 2013లో మొదటి పెళ్లి చేసుకుని, తన భార్యను వేధించాడు. అసభ్య వీడియోలు తీసి వాటిని భద్రపరుచుకొని తలాక్ చెప్పాడు. తనపై ఎవరికైనా పిర్యాదు చేస్తే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.
అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకుని ఆమెను కూడా వేధించి, వీడియోలు తీశాడు. ఆమెకు కూడా తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసి, తన బంధువైన 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను కూడా పెళ్లి చేసుకున్నాడు. సీన్ రిపీట్ చేసి మళ్లీ మరొక పెళ్లి చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే, ముగ్గురు భార్యలు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిత్యపెళ్లికొడుకుని అదుపులోకి తీసుకున్నారు.