: హిందూ బాలికతో పారిపోయాడని.. అతని బంధువును కొట్టి హత్య చేసిన యువకులు!


ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో యూసఫ్ (19) అనే ఓ ముస్లిం యువకుడు ఫజల్‌పూర్‌కి చెందిన ఓ హిందూ బాలిక (18) ను ప్రేమించాడు. గ‌త కొన్ని నెల‌లుగా ప్రేమ‌లో ఉన్న వీరిరువురు గ‌త నెల 27న ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ఎటో వెళ్లిపోయారు. కాగా, వారి వివ‌రాలు చెప్పాల‌ని, హిందూ యువ వాహిని కార్య‌క‌ర్త‌లుగా చెప్పుకుంటున్న కొంద‌రు యువ‌కులు యూస‌ఫ్ బంధువ‌యిన గులాం మ‌హ్మ‌ద్ ను అడిగారు.

వారి గురించి త‌న‌కు ఏం తెలియ‌ద‌న్న‌ప్ప‌టికీ అతనిని లాక్కుంటూ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. చెబుతావా? లేదా? అంటూ అక్కడ బెదిరించారు. చివ‌ర‌కు ఆయన చెప్పలేకపోవడంతో దారుణంగా కొట్టి హ‌త్య‌చేశారు. తమకు ఈ వివాదంతో సంబంధం లేన‌ప్ప‌టికీ మ‌హ్మ‌ద్‌ను చంపేశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News