: పావని నాకు చెల్లి లాంటిది.. మా మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం మాత్రమే ఉంది: నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై శ్రావణ్
హైదరాబాదులోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో తెలుగు టీవీ నటుడు ప్రదీప్ మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనపై వస్తోన్న ఆరోపణలను శ్రావణ్ ఖండించాడు. ఈ రోజు తెల్లవారు జామున ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య పావని తెలిపిన విషయం తెలిసిందే. అయితే, శ్రావణ్‌తో చనువుగా ఉండడంతోనే ప్రదీప్, పావనిల మధ్య గొడవ చెలరేగిందని ప్రదీప్ స్నేహితులు అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రావణ్.. పావనికి తనతో వివాహేతర సంబంధం ఉందని అంటున్నారని, అన్నాచెల్లెళ్ల మధ్య కూడా ఇలాంటివి రావడమేంటని వ్యాఖ్యానించాడు.
తాను ఓ అన్న స్థానంలో ఉండి పావనికి పెళ్లి చేశానని శ్రావణ్ అన్నాడు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉందని పేర్కొన్నాడు. పావనికి అన్నయ్య పొజిషన్‌లో ఉంటూ... వారి ఫ్యామిలీ మెంబర్‌గా మారిపోయానని అన్నాడు. రెగ్యులర్ గా జరిగే గొడవలాగే నిన్న కూడా గొడవ జరిగిందని వ్యాఖ్యానించాడు. ప్రదీప్ కూడా తనతో చాలా క్లోజ్‌గా ఉండేవాడని చెప్పాడు. సినిమాలకు తాము కలిసే వెళ్లేవారిమని అన్నాడు. పావని తనతో తీసుకున్న ఫొటోను మొబైల్‌లో ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవడం వల్లే గొడవ చెలరేగిందని వస్తోన్న వార్తలను ఖండించాడు. నిన్న రాత్రి కూడా ప్రదీప్ తనతో మామూలుగానే మాట్లాడాడని, ఎప్పుడూ ఉన్నట్లే తనతో ఉన్నాడని చెప్పాడు.