: ఆత్మహత్యకు పావని ప్రొఫైల్ పిక్కే కారణం.. నిన్న రాత్రి ఆ రూంలో ఉన్నది పావని సోదరుడు కాదు: నటుడు ప్రదీప్ సన్నిహితులు
తెలుగు టీవీ నటుడు ప్రదీప్ మృతి చెందడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు తెల్లవారు జామున ఆయన హైదరాబాదులోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య పావని తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ప్రదీప్ స్నేహితులు పోలీసులకి తెలిపిన వివరాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అసలు నిన్న రాత్రి జరిగిన పార్టీలో ఉన్నది పావని సోదరుడు కాదని, అతడి స్నేహితుడేనని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. అతడి పేరు శ్రావణ్ అని, దుబాయ్ నుంచి ఆయన నాలుగు రోజుల క్రితం ఇక్కడకు వచ్చి, పావని, ప్రదీప్‌లు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాడని తెలిపారు.
ఈ క్రమంలోనే శ్రావణ్ తన బర్త్ డే పార్టీని నిన్న అర్ధరాత్రి చేసుకున్నాడని చెప్పారు. కాగా, శ్రావణ్‌తో చనువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను పావని తన మొబైల్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుందని, దీంతోనే ప్రదీప్ పావనితో గొడవ పడ్డాడని తెలిపారు. ప్రదీప్ సూసైడ్ నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. శ్రావణ్, పావని కలిసే ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చని అన్నారు. కాగా, గొడవ కారణంగా ప్రదీప్ బాటిల్‌తో తన తలపై గట్టిగా కొట్టుకున్నాడని, ఆ గాజు ముక్కలను పనిమనిషితో పావని తీయించిందని స్థానికులు అంటున్నారు. మృతదేహం మంచం కింద ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో నిజానిజాలను తేల్చేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.