: తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల.. 84.15 శాతం ఉత్తీర్ణత



 తెలంగాణ‌లో ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ఈ రోజు స‌చివాలయంలో విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లోనూ బాలిక‌ల‌దే పై చేయి. మొత్తం 533701 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌గా వారిలో రెగ్యుల‌ర్ విద్యార్థులు 507938 ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 25763 మంది ఉన్నారు. రెగ్యుల‌ర్ విద్యార్థుల్లో 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఈ ఫ‌లితాల్లో రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 85.37 శాతం, బాలుర ఉత్తీర్ణ‌త శాతం 82.95 గా న‌మోదైంది. ఫ‌లితాల్లో జ‌గిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు 97.35 శాతం మంది ఉత్తీర్ణులై ఆ జిల్లాను ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిపారు. ఇక‌ వనపర్తి జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది.  

  • Loading...

More Telugu News