: తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: ఎంపీ బాల్క సుమన్


తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఎంపీ బాల్కసుమన్ వెల్లడించారు. మొత్తం 8792 ఉద్యోగాలతో పదిహేను రోజుల్లోనే డీఎస్సీ ప్రకటన విడుదల కానున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఈ రోజు ఆయన కలిశారు. సుమన్ తో పాటు గతంలో విద్యార్థి నాయకులుగా పని చేసిన పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయగౌడ్ తదితరులు ఉన్నారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ కూడా చేపడతారని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News