: పఠాన్ కోట్ లో కలకలం..కారు ఆపకుండా వెళ్లిపోయిన వ్యక్తులు!


పంజాబ్ లోని పఠాన్ కోట్ లో గుర్తుతెలియని వ్యక్తులు కారు ఆపకుండా వెళ్లిపోయిన సంఘటన కలకలం రేపింది. బెర్హంపూర్ చెక్ పోస్టు వద్దకు వచ్చిన ఓ  కారు ఆగకుండా దూసుకుపోయింది. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దీంతో, ఆ కారును పోలీసులు వెంబడించారు. అయితే, కొద్దిదూరం వెళ్లాక మఖన్ పూర్ గ్రామం వద్ద అందులోని వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. ఈ సందర్భంగా పఠాన్ కోట్ ఏఎస్పీ వివేక్ షీల్ సోనీ మాట్లాడుతూ, మఖన్ పూర్ గ్రామంలో రెండు వందల మంది పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని చెప్పారు. జమ్మూలోని సాంబా నుంచి ఈ కారును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని అన్నారు.  

  • Loading...

More Telugu News