: తన చెల్లిని ప్రేమించాడని.. గొడ్డలితో దాడి చేశాడు!
ఆ అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలియక ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరొకరితో పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో ఆ యువతి కనపించకుండా వెళ్లిపోయింది. తన చెల్లి ఓ యువకుడితో పారిపోయిందని తెలుసుకున్న ఆ యువతి సోదరుడు... ఎట్టకేలకు తన చెల్లిని ప్రేమించిన యువకుడిని పట్టుకొని గొడ్డలితో నరికాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరులో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. ఆ పట్టణానికి చెందిన హనుమప్ప ఈ దాడికి పాల్పడ్డాడు. తన చెల్లిని ప్రేమిస్తోన్న సురేశ్ అనే యువకుడిపై హనుమప్ప దాడి చేయడంతో ఆ యువకుడికి తీవ్రగాయాలయ్యాయని, అతడి కుటుంబసభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.