: కాసేపట్లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు.. భయంతో బాలిక ఆత్మహత్య


తెలంగాణలో కాసేపట్లో పదవ తరగతి పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇంకా ఫ‌లితాలు విడుద‌ల కాక‌ముందే, తీవ్రంగా ఆందోళ‌న చెందిన ఓ బాలిక‌, తాను ప‌రీక్ష త‌ప్పుతానేమోన‌ని భావించి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కూలి ప‌నులు చేసుకుంటూ త‌న‌ను ఇన్నాళ్లూ పాఠ‌శాలకు పంపిన త‌ల్లిదండ్రులకు ఏమ‌ని స‌మాధానం చెప్పాల‌ని, వారు బాధ‌ప‌డిపోతారేమోన‌ని ఆ బాలిక ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. అదే గ్రామంలోని మానస (15) అనే విద్యార్థిని పెన్‌పహాడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చ‌దువుకుని, ప‌దవ త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసింది. పరీక్ష ఫలితాల కోసం ఇన్ని రోజులూ భయంగా ఎదురు చూసిన ఆ బాలిక చివరికి ఈ ఘటనకు పాల్పడిందని స్థానికులు చెప్పారు. 

  • Loading...

More Telugu News