: బాహుబలిగా డార్లింగ్ ప్రభాస్ నటించిన తీరు అద్భుతం: రాం చరణ్ ప్రశంసల జల్లు


త‌న తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో క‌లిసి న‌టుడు రాం చరణ్ తేజ్‌ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూశాడు. ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబలిని తెర‌కెక్కించిన తీరుపై ఆయన ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. ‘బాహుబ‌లి-2 ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్.. రాజమౌళి ఊహ, విజువలైజేషన్ లు ఈ సినిమాను మళ్లీ చూడాల‌నిపిస్తున్నాయి. ఒక గొప్ప సినిమా అన్ని రకాల హద్దులను చెరిపేస్తుందని రుజువైంది. మ‌న‌ డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా న‌టించి తీరు అద్భుతం. నా ఫ్రెండ్‌ రానా తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో అల‌రిస్తున్నాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ల నటన అద్భుతం’ అని వ‌రుసగా ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశాడు రాంచ‌ర‌ణ్ తేజ్. బాహుబ‌లి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. రికార్డులను బద్దలు కొడుతూ బాహుబలి-2 దూసుకుపోతోంది.



  • Loading...

More Telugu News