: పోలీసుల ముందు కూడా భార్యకు తలాక్ చెప్పాడు... భార్యతో చెప్పుదెబ్బలు తిన్నాడు!
భార్యకు తలాక్.. తలాక్... తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేస్తున్నానంటూ వెళ్లిపోయాడు ఓ భర్త. తన భర్త నిర్వాకంపై ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు ఎక్కడున్నాడో కనిపెట్టిన పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కి భార్యాభర్తలిద్దరినీ రప్పించి సమస్యను పరిష్కరిద్దామనుకున్నారు. అయితే, పోలీసుల ముందు కూడా ఆ వ్యక్తి భార్యకు తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న సదరు ముస్లిం మహిళ తన భర్తను పోలీసుల ముందే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది.
బీహార్‌లోని నవతొలియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ మెహఫూజ్‌కు తన భార్యను కట్నం కోసం వేధించేవాడు. పెళ్లి జరిగిన సమయంలో తనకు తగినంత తేలేదని ఆమెతో గొడవపెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆమెకు తలాక్ అని మూడుసార్లు చెప్పి, విడాకులు ఇచ్చేసి వెళ్లిపోగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో భార్యతో చెప్పుదెబ్బలు తిన్న మహ్మద్ చివరికి తన భార్యను క్షమించమని కోరాడు.