: నేను ప్రతి రోజూ ఉదయం పుడతాను...రాత్రి చచ్చిపోతాను...ఛస్తే ఎలాగూ నరకానికే వెళ్తాను: రాంగోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి రోజూ ఉదయం తాను పుడతానని, మళ్లీ రాత్రి చచ్చిపోతానని చెబుతున్నాడు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా మేనియా నుంచి బయటకు వచ్చి రాంగోపాల్ వర్మ పలు అంశాలపై ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను ట్విట్టర్ రాజుని కాదని అన్నాడు. ఇంకా చెప్పాలంటే తానో జోకర్ నని పేర్కొన్నాడు. ఇతరులపైనే కాదు, తనపై కూడా తాను జోకులు వేస్తుంటానని ఆయన అన్నారు. అయితే ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు.
ఇకపై ఇతరులను తప్పుగా విమర్శించనని వినాయకుడిపై ఒట్టేశానని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటా కానీ నెగిటీవ్ గా వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు. తన జీవితం జర్నీలాంటిదని అన్నారు. ప్రతి ఉదయం కొత్తగా జన్మించి, రాత్రికి చనిపోతానని ఆయన అన్నారు. అందుకే ఏం చేసినా ఈ మధ్యలో ఉన్న పన్నెండు గంట్లోనే చేసేస్తానని ఆయన తెలిపారు. ఈ రోజుకి హాయిగా జీవించడమే తన లక్ష్యమని అనుకుంటానని ఆయన అన్నారు. చచ్చాక కచ్చితంగా నరకానికే వెళతానని తనకు తెలుసని, అందుకే బతికున్నన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ ఇక్కడే స్వర్గాన్ని వెతుక్కుంటానని ఆయన చెప్పారు.