: 'ఛీ...భారతీయులా... గో... గెటవుట్' అంటూ తిట్టిన ఆస్ట్రేలియా మహిళ!
అమెరికా తరహాలో ఆస్ట్రేలియాలో కూడా భారతీయులపై జాతి వివక్ష సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్ 22న సిడ్నీలోని లూనా పార్క్ కు ఉత్సవ్ పటేల్ తన గర్భవతి అయిన భార్య, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లాడు. పార్క్ లో రైడింగ్ చేద్దామని తన నాలుగేళ్ల కుమార్తె కోరడంతో తల్లిని దగ్గర్లో కూర్చోబెట్టి వెళ్లాలని భావించాడు. దీంతో కాసేపు భార్యతో వాకింగ్ చేసి, దగ్గర్లో ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఒక్కర్తే కూర్చోవడం చూసి... ఆమె దగ్గరకు వెళ్లి...తన కుమార్తెతో కలిసి రైడింగ్ కు వెళ్లాలనుకుంటున్నానని, అంతవరకు తన భార్యను పక్కనే కూర్చోబెట్టుకోవాలని ఆమెను కోరాడు.
అంతే... 'ఎవరు మీరు?' అని అడిగింది. భారతీయులమని తెలపగానే...'ఛీ...భారతీయులా?' అని కుడిచేతి మధ్య వేలు చూపిస్తూ... అనకూడని మాటలు అం ది. అంతటితో ఆగకుండా తనకు భారతీయులంటే అస్సలు ఇష్టం ఉండదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటూ అరచి గోల చేసింది. ఈ తతంగం మొత్తం వీడియో తీసిన ఉత్సవ్ పటేల్ సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.