: భళా భల్లాలదేవ... రానాపై అనిల్ కపూర్ ప్రశంసల జల్లు
బాహుబలి సినిమాలో భల్లాలదేవగా రానా నటించిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. ఆయన నటన పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. భల్లాలదేవ పాత్రలో రానాని తప్ప మరొకరిని ఊహించుకోలేమంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా రానాని ఆకాశానికెత్తేశాడు. బాహుబలి మూవీలో రానా నటన అద్భుతమని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
‘రానా.. నాకు కచ్చితంగా తెలుసు.. మీ తాతగారు ది గ్రేట్ రామానాయుడు గారిని గర్వపడేలా చేశావు’ అని అనిల్ కపూర్ అన్నాడు. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. బాహుబలిలో నటించిన ప్రతి ఒక్కరు తమదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
What a journey it's been for u @RanaDaggubati! I'm sure u made your Grandpa, the great #RamaNaidu very proud! #Bahubali2 pic.twitter.com/wGNwizzQ63
— Anil Kapoor (@AnilKapoor) 3 May 2017