: ఆ హీరోకు, నాకు మధ్య ఏమీ లేదు.. ఓ వ్యక్తితో డేటింగ్ చేశా: హెబ్బా పటేల్
హీరో రాజ్ తరుణ్ తో తనకు ఏదో సంబంధం ఉందనే వార్తల్లో నిజం లేదని... అవన్నీ పుకార్లు మాత్రమేనని హీరోయిన్ హెబ్బా పటేల్ స్పష్టం చేసింది. రెండు, మూడు సినిమాల్లో కలసి నటించినంత మాత్రాన తామిద్దరి మధ్య ఏదో ఉన్నట్టేనా? అని ప్రశ్నించింది. తమ మధ్య ఏదో గొడవ జరిగిందని కూడా పుకార్లు వచ్చాయని... అది కూడా అవాస్తవమని చెప్పింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది ఈ ముంబై భామ.
అయితే, గతంలో ఓ వ్యక్తితో మాత్రం డేటింగ్ చేశానని హెబ్బా తెలిపింది. ఆ వ్యక్తి తన తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్పింది. అతని నుంచి చాలా నేర్చుకున్నానని... అయితే, ఉన్నట్టుండి అతనితో దూరం పెరిగిపోయిందని తెలిపింది. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అతనే కారణమని చెప్పింది. ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని... ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే తీరిక కూడా లేదని తెలిపింది.