: చిరంజీవి సరసన ఐశ్వర్యారాయ్?


'ఖైదీ నంబర్ 150' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తా చాటి... తనలో జోరు తగ్గలేదని నిరూపించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన 151వ సినిమాపై ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంలో సినిమా యూనిట్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News