: ఓరినాయనో.. ఇలాంటి వాళ్లకి దండ వేసి దండం పెట్టాలి: టీవీ యాంకర్ లాస్య


ప్రముఖ టీవీ యాంకర్ లాస్య మూడు నెలల క్రితం మంజునాథ్ అనే మరాఠా యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాస్య గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. లాస్య తల్లి కాబోతోందనేదే ఆ వార్త. అయితే, ఈ వార్తను లాస్య ఖండించింది. "ఓరినాయనో... ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్లకి దండ వేసి దండం పెట్టాలి... దేవుడా" అంటూ కామెంట్ చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని విన్నవించింది. పెళ్లికి ముందు కూడా లాస్యపై అనేక రూమర్లు, ఫేక్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News