: నాకు అన్యాయం చేయడం సరికాదు: చంద్రబాబుతో ఎమ్మెల్యే బండారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ నేత, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన మనసులోని బాధనంతా చంద్రబాబు వద్ద ఆయన వెళ్లబోసుకున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా తాను పనిచేస్తున్నానని... టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని బండారు తెలిపారు. కేవలం సామాజిక సమీకరణాల కారణంగా తనకు అన్యాయం (మంత్రి పదవి ఇవ్వకపోవడం) చేయడం సరికాదని తన వాదనను బాబుకు వినిపించారు. బండారు ఆవేదన పట్ల చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. సమీకరణాల కారణంగా కొందరికి పదవులు ఇచ్చానని... పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని... సీనియర్లకు ఎట్టి పరిస్థితిలోను అన్యాయం చేయబోనని ఈ సందర్భంగా బండారుకు చంద్రబాబు హామీ ఇచ్చారు.