: పోలీసుల తుపాకులు ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే, షోపియాన్ జిల్లా కోర్టు ప్రాంగణంలో కొంత మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. వారి విధులు ముగియడంతో, తిరిగి వెళ్లిపోయేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా లోపలకు ప్రవేశించిన ఉగ్రవాదులు... వారి వద్ద నుంచి తుపాకులు లాక్కుపోయారు. మొత్తం ఆరు తుపాకులు లాక్కెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి అపాయం కలగలేదు. జరిగిన ఘటనతో పోలీసు వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో, విధుల్లో అప్రమత్తంగా లేని కారణంగా ఈ పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.