: కాసేపట్లో తెరుచుకోనున్న కేధార్ నాథ్ ఆలయం...తొలిపూజ మోదీదే!


కాసేపట్లో కేదార్ నాథ్ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి తొలిపూజను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. కొండలు, గుట్టల మధ్యనున్న కేదారేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు శ్రమకోర్చి వస్తారు. ఆరు నెలలపాటు మూసివుండే ఈ దేవాలయం తలుపులు తెరుచుకునే క్షణాల కోసం భక్తులు ఆశగా ఎదురు చూస్తారు.

ఈ అద్భుత ఘడియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరి కాసేపట్లో కేదార్ నాథ్ దేవాలయం ప్రధాన ద్వారం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా నిర్వహించే రుద్రాభిషేకంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ మేరకు ఆయన కేదార్ నాథ్ చేరుకున్నారు. దేవాలయ ఆవరణలో శాస్త్రోక్తమైన కార్యక్రమాలు పూర్తి చేసిన ఆయన, దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. గంటసేపు జరగనున్న రుద్రాభిషేకంలో పాల్గొంటున్నారు. 

  • Loading...

More Telugu News