: సైన్యానికి స్వేచ్ఛనివ్వండి...సమాధానం చెబుతారు: ఏకే ఆంటోనీ


సైన్యానికి స్వేచ్ఛనివ్వాలని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లపై విరుచుకుపడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో కేంద్రం మరింత సమర్థవంతంగా కఠినమైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అలా చేస్తే... వారే ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఒకే ఒక్కసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడుసార్లు పాకిస్థాన్ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టిందని, ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకుంటే లాభం లేదని ఆయన తేల్చిచెప్పారు. 

  • Loading...

More Telugu News