: గోరక్షణ, ట్రిపుల్ తలాక్ పక్కన పెట్టండి... పాక్ పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి: మాయావతి సూచన


పాకిస్థాన్ సైనికులు సరిహద్దులు దాటి వచ్చిమరీ ఇద్దరు జవాన్ల తలలు నరకడంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ, పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. ఇది దేశ ప్రజల అభిమతమని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. గోరక్షణ, ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలను పక్కన పెట్టి సరిహద్దులపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. పాకిస్థాన్ కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News