: సినిమా తరహాలో పెళ్లి చేసుకున్న వరుడిని జైల్లో పెట్టించిన వధువు!


సినీ ఫక్కీలో వివాహం చేసుకున్న పెళ్లికొడుకును పెళ్లి రోజే కేసు పెట్టి జైలుకు పంపించిందో చైనా నారి... ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... వాంగ్‌ అనే యువకుడు ప్రియురాలిని వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. వారి ప్రేమ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అంగీకరించకపోవడంతో ఆ విషయం తన ప్రియురాలికి తెలిపాడు. దీంతో వారు అంగీకరిస్తేనే వివాహం అని ఆమె తేల్చిచెప్పింది. దీంతో తన తల్లిదండ్రులను ఒప్పించే పూచీ తనదని, తమ వివాహ సమయానికి తీసుకొస్తానని ఆమెకు సర్ది చెప్పి, ఆమెను వివాహానికి ఒప్పించాడు. దీంతో వివాహ ముహూర్తం సమీపించింది. కళ్యాణ మంటపంలో 200 మంది బంధువులు, స్నేహితులు సందడి చేశారు. అయినప్పటికీ వధువు తన అత్తమామలు కనిపించడం లేదంటూ వరుడిని నిలదీసింది.

దీంతో వారు వస్తున్నారని, దారిలో ఉన్నారని నమ్మబలికాడు. వివాహ తంతు పూర్తైంది. ఇంతలో వధువు సోదరి సరికొత్త విషయం గుర్తించింది. వారి వివాహానికి వచ్చిన వారికి.. వాంగ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న సంబంధమంతా... డబ్బుతోనే... తన వివాహానికి బంధువులు, స్నేహితులుగా హాజరైతే మంచి భోజనంతోపాటు 9 నుంచి 12 డాలర్ల చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ విషయం వధువుకు ఆమె సోదరి తెలిపింది. అంతే, తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు వధువు... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని జైలుకి పంపించారు. తమ వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, దీంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని వాంగ్ వాపోతున్నాడు. 

  • Loading...

More Telugu News