: నాలుగు బంతుల్లో 94 పరుగులు ఇచ్చాడని బౌలర్ పై 10 ఏళ్ల నిషేధం


కేవలం 4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చిన బౌలర్ పై బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్ లీగ్‌ లో భాగంగా జరిగిన ఈ తతంగంపై విచారణ చేసిన క్రికెట్ బోర్డు బౌలర్‌ సుజాన్‌ మహ్మద్‌ పై 10 ఏళ్ల నిషేధం విధించింది. బౌలింగ్‌ వేసిన తీరు క్రికెట్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందని, అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ క్రికెట్‌ బోర్డు క్రమశిక్షణ కమిటీ చీఫ్‌ షేక్‌ సోహెల్‌ తెలిపారు.

కాగా, 50 ఓవర్ల మ్యాచ్‌ లో మొదట లాల్మాటియా క్లబ్‌ 14 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఈ మ్యాచ్‌తో పాటు దీనికి ముందు కూడా అంపైర్లు తమ జట్టు విషయంలో వివక్ష ప్రదర్శించారని.. తమకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు ప్రకటించారని ఆరోపించిన లాల్మాటియా క్లబ్‌ జట్టు.. బౌలింగ్‌ ద్వారా తమ నిరసనను తెలియజేసింది. ఆ జట్టు బౌలర్‌ సుజాన్‌ మహ్మద్‌ వరుసగా 13 వైడ్లు, 3 నోబాల్స్‌ వేశాడు. వాటిని కీపర్‌ ఆపకపోవడంతో బౌండరీకి వెళ్లాయి. బౌలర్‌ సరిగ్గా వేసిన నాలుగు బంతులు కూడా ఫోర్లుగా వెళ్లాయి. దీంతో కేవలం 0.4 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టు 92 పరుగులు చేసి విజయం సాధించింది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో కేవలం రెండు బంతుల్లోనే 18 పరుగులు వచ్చి ఆశ్చర్యపరచగా... 4 బంతుల్లో 92 పరుగులు ఇవ్వడం మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి. 

  • Loading...

More Telugu News