: శృంగారం మరీ ఎక్కువైందని.. హీరోయిన్‌పై ఏడాదిపాటు నిషేధం!


హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనకు ప్రాంతీయ, భాషా భేదాలు లేవు. నిజానికి ఆ ప్రదర్శనే వారికి అవకాశాలు తెచ్చిపెడుతోంది. అందుకే నటీమణులు పోటీలు పడి అందాల ఆరబోతకు సిద్ధమై ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతుంటారు. అయితే కాంబోడియాలో మాత్రం 24 ఏళ్ల కుర్ర హీరోయిన్‌ డెన్నీ క్వాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె మరీ సెక్సీగా ఉందని పేర్కొంటూ ఆ దేశ సాంస్కృతిక శాఖ ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించింది. పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అంగాంగ ప్రదర్శనతో ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఉల్లంఘించిందని, అమెకు క్లాసులు అవసరమని పేర్కొంది. సినిమాల్లో ఎటువంటి వస్త్రధారణ చేసుకోవాలని అనే విషయంలో సాంస్కృతిశాఖతో క్లాసులు ఇప్పించనున్నట్టు అధికారులు తెలిపారు.

సాంస్కృతికశాఖ తీరుతో మనస్తాపం చెందిన డెన్నీ మాట్లాడుతూ తనకంటే సెక్సీగా కనిపించే హీరోయిన్లు చాలామంది ఉన్నారని, కానీ తనపైనే వేటేశారని వాపోయింది. ఆమెపై నిషేధాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫేస్‌బుక్‌లో ఆమెను ఫాలో అవుతున్న 3 లక్షల మంది ఆమెకు బాసటగా నిలిచారు. సాంస్కృతిక శాఖ తీరుపై దుమ్మెత్తి పోశారు. కాగా, ఇక ముందు మరీ సెక్సీగా ఉండకుండా జాగ్రత్త పడతానని, కాంబోడియా సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించేలా దుస్తులు ధరిస్తానని డెన్నీ పేర్కొంది.

  • Loading...

More Telugu News