: ఆర్థిక సంవత్సరాన్ని మార్చుకున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్!
ఇకపై మధ్యప్రదేశ్ లో ఆర్థిక సంవత్సరం (ఫిస్కల్ ఇయర్) మార్చి-ఏప్రిల్ కాదు..డిసెంబరు- జనవరి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం, మధ్యప్రదేశ్ ప్రజా సంబంధాల శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం మారిందని, ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం పద్దును ఆమోదించే బడ్జెట్ సమావేశాలు ఈ డిసెంబరు-జనవరిలో జరగనున్నాయని చెప్పారు.
కాగా, ఆర్థిక సంవత్సరాన్ని మార్చి-ఏప్రిల్ నుంచి డిసెంబర్-జనవరికి మార్చాలని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. ఈ సూచనల నేపథ్యంలోనే సీఎం శివరాజ్ వేగంగా స్పందించారు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చుకున్న తొలి రాష్ట్రంగా మధ్య ప్రదేశ్ రికార్డుల కెక్కడం విశేషం.