: నా కెరీర్లో తొలిసారిగా దేవుడిపై తీసిన పాట ఇది: రామ్ గోపాల్ వర్మ
తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా దేవుడిపై ఓ పాటను చిత్రీకరించానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కార్-3’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ‘త్వరలోనే విడుదల కానున్న సర్కార్-3 చిత్రంలో గణేష్ హారతి పాటను అమితాబ్ పాడారు’ అని తన ట్వీట్ లో పేర్కొన్న వర్మ, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Ganpati Aarti video from Sarkar 3 sung by Amitabh Bachchan https://t.co/OpU5ymD4fg
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2017