: ‘బాహుబలి-2‘ చూసేందుకు గ్రహాంతర వాసులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు!: రామ్ గోపాల్ వర్మ


‘బాహుబలి’ సిరీస్ పై తన దైన శైలిలో ట్వీట్లు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ట్వీట్ చేశారు.  'బాహుబలి-2 చిత్రాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు వెళుతున్నారు. నాకేమీ ఆశ్చర్యం కల్గించడం లేదు. ఈ సినిమా చూసేందుకు ‘మార్స్’ గ్రహవాసులు తమ స్పేస్ షిప్ లలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని వర్మ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు, చేసిన ట్వీట్ లో ‘బాహుబలి-2’ ఇండియా ‘అవతార్’ అని కితాబు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి-2 చిత్రం రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పుతోంది.

  • Loading...

More Telugu News