: కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది: ఎమ్మెల్యే పుట్టా మధుకర్
కల్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని, ముఖ్యంగా తాటికల్లు, ఈతకల్లు తాగడం ద్వారా కేన్సర్ బారిన పడకుండా ఉంటామని మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కీపూర్ గ్రామంలోని మద్దికుంట తాటి వనంలో ఆయన కల్లు తాగారు. అనంతరం, మధు మాట్లాడుతూ, తాటికల్లు, ఈతకల్లు తాగినంత కాలం కిడ్నీలలో రాళ్లు రాకుండా ఉంటాయని, ఈ విషయాన్ని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. కల్లు తాగే అలవాటు తెలంగాణ ప్రాంతంలో ఉందని, ఈ అలవాటును సమైక్య పాలనలో ధ్వంసం చేస్తూ గుడుంబా తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.