: తిరుగుబాటు ప్రారంభం... ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం
రాజకీయ విశ్లేషకులు ఊహించినట్లే జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం మొదలైంది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పలువురు సొంత నేతలే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా కుమార్ విశ్వాస్ ఒకరు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆయన అన్నట్లు సమాచారం. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండాలా? లేదా? అన్న విషయం గురించి 24 గంటల్లో ఓ ప్రకటన చేస్తానని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారని కూడా ఆయన చెప్పారు.