: విరామం లేకుండా మోగుతున్న ప్రభాస్ ఫోన్


'బాహుబలి-2' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశ వ్యాప్తంగా పాప్యులర్ హీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట. ప్రభాస్ ను అభినందించడానికి ఎంతో మంది అతని ఫోన్ కు కాల్స్ చేయడం, మెసేజ్ లు పంపడం చేస్తున్నారు. దీంతో, కాల్ రింగ్ టోన్స్, మెసేజ్ టోన్స్ తో అతని ఫోన్ విరామం లేకుండా మోగుతూనే ఉందట. ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ ను పొగుడుతూ, ఆకాశానికెత్తేస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన శ్రమను ఈ అభినందనలతో ప్రభాస్ మర్చిపోతున్నాడు. 

  • Loading...

More Telugu News