: అదిరిపోయింది... హ్యాట్సాఫ్‌!: బాహుబలి-2 సినిమాపై సూర్య


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమాపై పలువురు సినీనటులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో తమిళ హీరో సూర్య కూడా చేరాడు. ఈ రోజు సోషల్‌మీడియా ద్వారా బాహుబలి 2 సినిమాపై స్పందిస్తూ...  ఆ చిత్రం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఈ చిత్రాన్ని అస‌లు ఏ విధంగా ప్రశంసించినా సరిపోదని పేర్కొన్నాడు. రాజమౌళి సర్‌ మన చిత్ర పరిశ్రమకు చక్కటి స్ఫూర్తినిచ్చారని ఆయ‌న అన్నాడు. అదిరిపోయింది! హ్యాట్సాఫ్‌... ‘బాహుబలి 2’ అని ట్విట్ట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన‌ రాజమౌళి కూడా సూర్యకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Loading...

More Telugu News