: దలైలామాకు మన ప్రభుత్వ అధికారుల నుంచే నిధులు వెళుతున్నాయి: చైనా సంచలన వ్యాఖ్యలు
బౌద్ధ మత గురువు దలైలామాకు చైనా ప్రభుత్వ అధికారుల నుంచే నిధులు అందుతున్నాయంటూ చైనాలోని అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి చర్యల వల్ల వేర్పాటువాదులపై తాము చేస్తున్న పోరాటం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పార్టీలోని వారే కొంతమంది దలైలామాకు నిధులు ఇస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వారివల్ల వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపింది. వేర్పాటువాద సమస్యలను, దేశానికి సంబంధించిన ముఖ్యమైన రాజకీయ అంశాలను కొందరు నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పింది. ఈ వివరాలను చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.