: ముక్కు కుట్టించుకున్న అమీర్ ఖాన్!


విలక్షణ నటుడు అమీర్ ఖాన్ ముక్కు కుట్టించుకున్నాడు. తన తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ కోసమే అమీర్ ముక్కు కుట్టించుకున్నట్టు సమాచారం. ‘ధోనీ’ సినిమా నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి అమీర్ ఖాన్ ఓ ఫొటో దిగాడు. ఈ ఫొటోను సుశాంత్ సింగ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫొటోలో అమీర్ ముక్కుపుడక పెట్టుకుని ఉన్నాడు. కాగా, అమీర్ ను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎందుకు కలిశాడనే విషయమై బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత అక్టోబర్ లో ఒక మ్యాగజైన్ కవర్ పేజీపై రణవీర్ ముక్కుపుడకతో ఉండటాన్ని అమీర్ చూశాడని సమాచారం. ఆ ఇన్స్పిరేషన్ తోనే అమీర్ ముక్కుపుడక పెట్టుకున్నాడని బాలీవుడ్ టౌన్ చర్చించుకుంటోంది.

  • Loading...

More Telugu News