: ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోలుకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు: మేకపాటి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనేందుకు వెచ్చిస్తున్న సమయాన్ని ప్రజల సంక్షేమానికి చంద్రబాబు వినియోగించడం లేదని, ప్రజాస్వామ్య విలువలను ఆయన కాలరాస్తున్నారని మండిపడ్డారు.
నాడు ఒకే ఓటు అవసరమైనప్పుడు వాజ్ పేయి ఎవరినీ కొనుగోలు చేయలేదని, ఇటీవల జరిగిన కేరళ ఎన్నికల్లో రావాల్సినంత మెజార్టీ సాధించని లెఫ్ట్ పార్టీ బేరసారాలకు పాల్పడలేదని అన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పై మంత్రులతో పోకిరీ మాటలు మాట్లాడిస్తున్నారని, చంద్రబాబుకు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని మేకపాటి అన్నారు.