: మంత్రి లోకేశ్ ను... లో‘క్యాషు’ అంటున్నారు: జగన్ ఎద్దేవా
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి ఓ కొత్త వ్యక్తి వచ్చారని, ఆయన కూడా పలు ఆదేశాలు జారీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు గుంటూరులో దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... లోకేశ్ పేరును ఈ మధ్య టీడీపీ నేతలే లో క్యాషు అంటున్నారని ఎద్దేవా చేశారు.
‘ఏ పని జరగాలన్నా క్యాషేనట.. రైతులు, ప్రజల మీద వారికి ప్రేమ ఉండదు... కాంట్రాక్టర్ల మీద మాత్రమే ప్రేమ ఉంటుంది.. మిర్చి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. రైతులు దారుణంగా నష్టపోతున్న నేపథ్యంలో గవర్నమెంటే ఇలా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయడం లేదు, ప్రభుత్వ నేతలు వారి లాభాలను వారు చూసుకుంటున్నారు. మూడేళ్లు అయిపోయింది.. రైతుల కష్టాలు మాత్రం చంద్రబాబు నాయుడికి కనబడడం లేదు.. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని నేను అడుగుతున్నా.. మామూలుగా దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు రేట్లు ఎక్కువగా ఉండాలి.. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం దిగుబడి తగ్గింది.. రేట్లు కూడా పడిపోయాయి. రైతులకి ఇబ్బందులు తప్పా ఇంకేమీ లేవు’ అని జగన్ అన్నారు.