: బాత్రూంలో సెల్ఫీ దిగిన సెలబ్రిటీలు.. వివాదాస్పదం
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ షోలో పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు అదరగొట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్ఫీ వివాదాస్పదమైంది. దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్ లోకి వెళ్లగా... కైలీ ఈ సెల్ఫీని తీసింది. వాస్తవానికి మెట్ గాల్ రూల్స్ ప్రకారం అక్కడ సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్ధం. అలాంటిది ఇంతమంది బాత్రూమ్ లోకి దూరి సెల్ఫీ దిగడంతో షో నిర్వాహకులు మండిపడుతున్నారు. కిమ్ కర్ధాషియన్, లిలి అల్ డ్రిడ్జ్, ప్యారిస్ జాక్సన్, బ్రీ లార్సన్, రాకీ, కెండల్ జెన్నర్ తదితరులు ఈ సెల్ఫీకి పోజిచ్చారు. ఈ సెల్ఫీని కైలీ జెన్నర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫొటోకు 20 లక్షల లైకులు వచ్చాయి.