: తూ.గో.జిల్లా టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ!
తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు వల్లూరి సాయికుమార్ ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున దొంగలుపడ్డారు. మండపేటలోని ఆయన ఇంట్లోకి చొరబడ్డ దొంగలు సుమారు రూ. 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. ఈ సమాచారం మేరకు రామచంద్రాపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.