: ‘బాహుబలి’, ‘నిరుత్తరా’... ఒకే రోజు రెండు సినిమాలు చూసిన కర్ణాటక సీఎం
ఇటీవలే విదేశీ పర్యటనల్లో బిజీబిజీగా గడిపిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న తన కుటుంబంతో కలిసి సినిమాలు చూసి సేదతీరారు. ఆయన ఒకటే రోజు రెండు సినిమాలు చూడడం విశేషం. నిన్న ఉదయం ‘బాహుబలి-2’, మధ్యాహ్నం కన్నడ సినిమా ‘నిరుత్తరా’ సినిమాలను సిద్ధరామయ్య... తన తనయుడు యతీంద్ర, ఇద్దరు మనవళ్లు, ఇద్దరు మంత్రులతో కలిసి చూశారు. సిద్ధరామయ్యతో పాటూ అదే హాల్ లో మొత్తం 48 మంది ఈ సినిమాలు చూశారు.
ಸಚಿವರಾದ ಡಾ. ಜಿ.ಪರಮೇಶ್ವರ, ರೋಷನ್ ಬೇಗ್ ಅವರೊಂದಿಗೆ ಅಪೂರ್ವ ಕಾಸರವಳ್ಳಿ ನಿರ್ದೇಶನದ ನಿರುತ್ತರ ಚಲನಚಿತ್ರ ವೀಕ್ಷಣೆ ಸಂದರ್ಭ. pic.twitter.com/O3rkvJ6ug9
— CM of Karnataka (@CMofKarnataka) 1 May 2017