: 'స'కారాన్ని వదిలేశాను, ఆపద్బాంధవుడు పోయిందన్నారు: కె. విశ్వనాథ్
తన చిత్రాల్లో 'స'కారపు సెంటిమెంట్ పై కళాతపస్వి కె. విశ్వనాథ్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఏ మనిషికైనా ఏదో ఒకచోట బ్లైండ్ సెంటిమెంట్ ఉంటుందన్న మాట వాస్తవమేనని అన్నారు. అందునా సినిమా వాళ్లు చాలా అధైర్యస్తులని, తమపై తాము నమ్మేదానికన్నా, ఏదో శక్తి ఉందని, అదే విజయాన్ని, పరాజయాన్ని ఇస్తాయని నమ్మతారని అన్నారు.
కర్మకాలి ఓ అక్షరంతో నాలుగైదు పేర్లు కుదిరి అవి సక్సెస్ అయితే, అమ్మో అందులో ఏదో ఉందనే పరిస్థితి తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. అదే వీక్ నెస్ అవుతుందని చెప్పారు. 'స'కారంతో తాను తీసిన సినిమాలన్నీ విజయవంతం కావడం, అది లేకుండా ఏదైనా ఓ సినిమా అనుకున్నప్పుడు కూడా కొందరు ఆ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. 'స'కారాన్ని వదిలేసి 'అ'కారాన్ని తీసుకుని 'ఆపద్బాంధవుడు' అన్నారని అందువల్లే ఆ చిత్రం అనుకున్నంత మేరకు ఆడలేదని ఎత్తి చూపారని గుర్తు చేసుకున్నారు.