: 'జపం జపం జపం... కొంగ జపం': జగన్ పై ఆనం వివేకా
ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి కాసేపు ముచ్చటించిన నెల్లూరు జిల్లా నేత ఆనం వివేకానందరెడ్డి, అపై మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెనకేసుకుని, ప్రజల కళ్లల్లో మిర్చి పొడి కొట్టిన జగన్, ఇప్పుడు గుంటూరులో కూర్చుని 'జపం జపం జపం కొంగ జపం' చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఏ సమస్యపైనా ఒక అవగాహన లేని జగన్ కు రైతుల సమస్యలు ఒక్కటైనా తెలియదని అన్నారు. తాము తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరుతామని వచ్చిన వార్తలన్నీ నిరాధారాలేనని, మీడియా సృష్టేనని స్పష్టం చేశారు.