: సెల్ఫీ మోజులో నలుగురి డాక్టర్ల మృతి!
ప్రమాదకర ప్రదేశాల్లోనూ సెల్ఫీలు తీసుకుంటూ యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నప్పటికీ ఆ మోజులో పడ్డవారు మాత్రం ఆ పిచ్చినుంచి బయటకు రాలేకపోతున్నారు. యువతే కాకుండా అన్ని వయసుల వారిదీ ఇదే తంతు. సెల్ఫీల మోజులో పడి నలుగురు వైద్యులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలో చోటుచేసుకుంది. భీమా నదిపై ఉన్న ఉజనీ డ్యామ్ వద్దకు విహారయాత్రకు వెళ్లిన 10 మంది వైద్యులు అక్కడ జాలర్ల నుంచి పడవలు తీసుకొని సరదాగా బోటింగ్ చేశారు. కొందరు డాక్టర్లు బోట్‌లో నిలబడి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. బోట్ అస్మాత్తుగా పక్కకు ఒరగడంతో అది మునిగిపోయింది. అందులో ఆరుగురు వైద్యులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగతా నలుగురు డాక్టర్లు మృతి చెందారు.