: మంత్రి లోకేష్ తక్షణ కర్తవ్యాలివే: దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న చంద్రబాబునాయుడు, తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కు దిశానిర్దేశం చేశారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ఎంత కసరత్తు చేస్తామో, ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించి ప్రోత్సహించేందుకూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. జన్మభూమి కమిటీల పనితీరు బాగాలేదన్న విమర్శలను ప్రస్తావిస్తూ, కొందరి తప్పుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలని అన్నారు. తాగునీటి విషయంలో 25 శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈ సమస్యపై లోకేష్ మరింతగా దృష్టిని సారించాలని కోరారు.