: రూ. 1500కే 4జీ స్మార్ట్ ఫోన్... భారత మార్కెట్లోకి తేనున్న చైనా సంస్థ
అతి తక్కువ ధరకు అంటే... కేవలం రూ. 1500కే 4జీ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు చైనా సంస్థ స్ప్రెడ్ ట్రమ్ సిద్ధంగా ఉంది. ఆ కంపెనీ హెడ్ నీరజ్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఇండియాలోని పార్ట్ నర్ సంస్థలతో కలసి ఈ సంస్థ ప్రచారాన్ని ప్రారంభించింది. అందరికీ అందుబాటు ధరల్లో 4జీ ఫీచర్ ఫోన్ ను అందిస్తామని నీరజ్ వెల్లడించినట్టు 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే స్ప్రెడ్ ట్రమ్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీతో కలసి లైఫ్ సిరీస్ లో ఫ్లేమ్ 5, లావాతో కలసి లావా ఎంఐ 4జీ ఫోన్ లను అందించింది. కాగా, తాము కూడా రూ. 1500 ధరలో 4జీ ఫోన్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, స్మార్ట్ ఫోన్ లా కాకుండా ఫీచర్ ఫోన్ రూపంలో ఇది ఉంటుందని పేర్కొంది.