: ప్రతి హిందువు 8మంది పిల్లల్ని కనాలి: సనాతన్ ధర్మ మహాసంగ్


హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని సనాతన్ ధర్మ మహాసంగ్ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రభోదానంద గిరి హెచ్చరించారు. హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతోందని... హిందూ మతాన్ని కాపాడుకునేందుకు హిందూ దంపతులందరూ 8 మంది చొప్పున పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది హిందూ బాధ్యతగా భావించాలని... తద్వారా హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని అన్నారు. హిందువుల భద్రత కోసం 'హిందూ రక్షా దళ్'ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోవధను నిషేధించి చరిత్రపుటల్లోకి ఎక్కారని తెలిపారు. మన దేశానికి నరేంద్ర మోదీ రూపంలో మంచి ప్రధాని లభించారని అన్నారు.

  • Loading...

More Telugu News