: బాహుబలిలో 'ఈ ఐదూ తప్పులే'నంటూ వెరైటీగా స్పందించిన దర్శకుడు విఘ్నేష్ శివన్!


'బాహుబలి-2' చిత్రంలో భల్లాలదేవుడికి పెళ్లి కాకుండా కొడుకెలా వచ్చాడని, కట్టప్పను తీసుకొచ్చి కట్టేసిన వాళ్లు ఎవరు? వంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తుండగా, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఆ సినిమాను చూసి, ఇందులో ఐదు తప్పులున్నాయంటూ వెరైటీగా స్పందిస్తూ, రాజమౌళి టీమ్ కృషిని కొనియాడాడు. ఈ చిత్రాన్ని కేవలం రూ. 120 ఇచ్చి చూడటం మొదటి తప్పని, ప్రతి థియేటర్ దగ్గరా కలెక్షన్ బాక్సును పెట్టాలని అన్నాడు. సినిమా కేవలం మూడు గంటల్లోనే ముగిసిపోయేలా ఎడిటింగ్ చేయడం తనకు కనిపించిన రెండో తప్పని, దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారని అన్నాడు.

బాహుబలి సిరీస్ ను రెండు సినిమాలతో ఆపేయాలని చూడటం మూడో తప్పని, కనీసం పది భాగాలైనా రావాలని అన్నాడు. ఈ సినిమా టూమచ్ పర్ ఫెక్షన్ తో ఉండటం నాలుగో తప్పని, దీన్ని చూసిన గొప్ప దర్శకులు తమ హెడ్ వెయిట్ ను తగ్గించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. ఈ సినిమా బెంచ్ మార్క్ ను సెట్ చేయడం చాలా క్లిష్టమని, ఇది రాజమౌళి చేసిన ఐదో తప్పని చెబుతూ, ఈ రికార్డులను అధిగమించడానికి ఎన్నో సంవత్సరాల సమయం పడుతుందని అన్నాడు. విఘ్నేష్ రాసిన ఈ ఐదు తప్పులూ రాజమౌళి కృషి, పట్టుదలకు ఇస్తున్న ప్రశంసలే. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్.

  • Loading...

More Telugu News