: ఆంధ్రజ్యోతి ఆఫీసుకు కేసీఆర్, హరీశ్, తలసాని... తమకు జరిగిన నష్టాన్ని దగ్గరుండి చూపిన ఎండీ రాధాకృష్ణ!


గత శనివారం హైదరాబాద్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పత్రికా కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు, అధికారులు కూడా వచ్చారు. వీరందరినీ ఆఫీసులోకి తీసుకెళ్లిన పత్రిక ఎండీ రాధాకృష్ణ, తమకు జరిగిన నష్టాన్ని దగ్గరుండి చూపించారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2, 3 అంతస్తులను కేసీఆర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన కారణాలను విశ్లేషించారు.

  • Loading...

More Telugu News