: భారత సంతతి కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ రాజీనామాకు డిమాండ్


తన ప్రసంగాల్లో సైనిక రహస్యాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనడా రక్షణ మంత్రి, భారత సంతతి వ్యక్తి హర్జిత్ సజ్జన్ రాజీనామాకు డిమాండ్ పెరుగుతోంది. తాను పొరపాటున సైనిక విషయాలు ప్రస్తావించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ, ఇది కేవలం క్షమాపణలు చెప్పేంత చిన్న విషయం కాదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

1950 తరువాత కెనడా చేపట్టిన అతిపెద్ద మిలటరీ ఆపరేషన్ 'ఆపరేషన్ మెడూసా' వెనక తానే ఉన్నానని ఆయన చెప్పుకున్నారు. సజ్జన్ ఇండియాలో పర్యటిస్తూ, ఓ సభలో మాట్లాడుతున్న వేళ, ఆఫ్గనిస్థాన్ లో తాము చేపట్టిన సైనిక దాడులను ప్రస్తావించి సమస్యలను కొని తెచ్చుకున్నారు. 2006లో కెనడా, బ్రిటన్ దళాలు కాందహార్ ప్రావిన్స్ నుంచి తాలిబాన్లను తరిమేందుకు చేపట్టిన ఆపరేషన్ లో 12 మంది కెనడా, 14 మంది బ్రిటన్ సోల్జర్లు అమరులయ్యారు. ఆయన క్షమాపణలు చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఆ వివాదానికి స్వస్తి చెప్పాలని ప్రధాని జస్టిన్ ట్రుడావు విజ్ఞప్తి చేసినా, విపక్షాలు మాత్రం రాజీనామాకే పట్టుబడుతున్నాయి.

  • Loading...

More Telugu News