: తల తెచ్చివ్వండి... లేకుంటే ప్రతీకారం తీర్చుకురండి: మరణించిన జవాను కుటుంబం
పాకిస్థాన్ సైన్యానికి చిక్కి, చిత్ర హింసలు అనుభవించి, తలలేని మొండేలుగా మిగిలి భారత సైన్యానికి కనిపించిన ఇద్దరు జవాన్లలో ఒకరైన సుబేదార్ పరమ్ జీత్ సింగ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. తల లేకుండా మొండెం మాత్రమే ఉన్న మృతదేహాన్ని తాము స్వీకరించి అంత్యక్రియలు నిర్వహించలేమని స్పష్టం చేసిన ఆయన కుటుంబ సభ్యులు, తలనైనా తిరిగి తీసుకురావాలని, లేకుంటే ప్రతీకారం తీర్చుకుని వచ్చిన తరువాతే మృతదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాక్ దుర్మార్గానికి సరైన జవాబు ఎప్పుడు చెబుతారో తక్షణం వెల్లడించాలని, మాటలు చెప్పడం మాని చేతలతో చూపించాలని పరమ్ జిత్ కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.